యాదవులకు 18% నిధులు కేటాయించాలి: వెంకట్ యాదవ్

యాదవులకు 18% నిధులు కేటాయించాలి: వెంకట్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బడ్జెట్ లో 18 శాతం నిధులు కేటాయించాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సీట్ల వాటా.. ఆర్థిక వాటా.. రాజ్యాధికారమే అంతిమ బాట’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్​మాట్లాడుతూ.. జనాభా ప్రకారం అన్ని రంగాల్లో యాదవుల ప్రాతినిధ్యం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, ద్రవిడ దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు కృష్ణారావు, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు కోన గురవయ్య, సినీనటి కరాటే కల్యాణి, కాలువ మల్లయ్య, చింతల రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.