కార్మికులకు కాకా చేసిన సేవలు మరువలేనివి : దయానంద్

కార్మికులకు కాకా చేసిన సేవలు మరువలేనివి : దయానంద్
  • కార్మికులకు కాకా చేసిన సేవలు మరువలేనివి 
  •  కాకా విగ్రహం దగ్గర శ్రమశక్తి అవార్డుల ప్రదానం
  •  వెంకటస్వామి మెమోరియల్ గిల్డ్ ఆధ్వర్యంలో అవార్డుల అందజేత


హైదరాబాద్, వెలుగు: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ఒక ప్రాంతం, భాష, మతానికి, వర్గానికి పరిమితమైంది కాదని, ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి పండుగ అని వెంకటస్వామి మెమోరియల్ గిల్డ్ చైర్మన్ దయానంద్ అన్నారు. గొప్ప చరిత్ర కలిగిన మే డే రోజున అమెరికాలోని షికాగో నగరంలో పని గంటలు తగ్గించాలని పోరాటం చేశారని, అది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. సోమవారం మే డే సందర్భంగా 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహం వద్ద కాకా మోమోరియల్ గిల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిల్డ్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ దయానంద్, సెక్రటరీ రాజేందర్, ఆర్టిస్ట్ మద్దెల శివకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి శ్రమ శక్తి అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్మిక వర్గానికి కాకా చేసిన సేవలను మరువలేనివని పలువురు గుర్తుచేసుకున్నారు. కాకా మెమోరియల్ గిల్డ్ ఆధ్వర్యంలో అవార్డుల అందజేయటం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కాకా కుమారులు వివేక్ వెంకటస్వామి, వినోద్‌‌‌‌‌‌‌‌ల కోరిక మేరకు ఈ ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా, కార్మికులకు, యజమానులకు మధ్య వార ధిగా, సామరస్యాన్ని నెలకొల్పిన సామాజిక వేత్త ఆనంద్ రావుకు బెస్ట్ మేనేజమెంట్ అవార్డ్ అందజేశామని గిల్డ్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు తెలిపారు.

అవార్డ్‌‌‌‌‌‌‌‌ రావడం ఆనందంగా ఉంది

మే డే రోజున బెస్ట్ మేనేజమెంట్ అవార్డ్ రావడం ఆనందంగా ఉందని ఆనంద్‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తాను ఈ స్టేజ్‌‌‌‌‌‌‌‌కు రావడానికి కారణం బీఆర్ అంబేద్కర్ అని గుర్తుచేశారు. కార్మిక వర్గానికి కాకా వెంకటస్వామి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చారని, అన్యాయాలను ఎదిరించారని గుర్తుచేశారు.

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హక్కుల అమలుకు కాకా కృషి..

కాకా ప్రాంగణంలో మే డే జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రాజ్ అన్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అమలు చేయటానికి కాకా ఎంతో కృషి చేశారన్నారు. కాకా అంటే ఆయన ఇంటి పేరు కాదని కార్మికుల కరుణామయుడని పేర్కొన్నారు. కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని ప్రధాని మోడీని కోరుతున్నామని చెప్పారు. అలాగే, కొత్త పార్లమెంట్‌‌‌‌‌‌‌‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను సీఎం కేసీఆర్ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీని, ఇంత వరకు అమలు చేయలేదని గుర్తుచేశారు.