మెగా విక్టరీ కాంబో ఫిక్స్: ‘చిరు సార్.. మై బాస్’.. వెంకీమామ ఎంట్రీ గ్లింప్స్ అదిరింది..

మెగా విక్టరీ కాంబో ఫిక్స్: ‘చిరు సార్.. మై బాస్’.. వెంకీమామ ఎంట్రీ గ్లింప్స్ అదిరింది..

మెగాస్టర్ చిరంజీవి-విక్టరీ వెంకటేష్ కాంబో ఫిక్స్ అయింది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ మూవీ షూటింగ్లో వెంకీ మామ జాయిన్ అయినట్లుగా చిరు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ (2025 అక్టోబర్ 23న) వెంకటేష్‌కు చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

చిరు రిలీజ్ చేసిన ఈ వీడియోలో వెంకటేష్ షూటింగ్ సెట్స్‌కు రాగా ‘వెల్కమ్ వెంకీ.. మై బ్రదర్’ అని చిరంజీవి అనగా.. ‘చిరు సార్.. మై బాస్’ అని వెంకటేష్ ఒకరినొకరు హత్తుకున్నారు. ఇపుడు ఈ క్రేజీ కాంబో ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికీ.. చిరు-నయన్ 'మీసాల పిల్ల' సాంగ్.. వరల్డ్ మ్యూజిక్ లిస్ట్లో టాప్లో ట్రెండ్ అవుతుంది.

మ్యాజిక్ సృష్టిస్తారా?

అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీని, ఎమోషన్‌ను సమపాళ్లలో మిళితం చేయడంలో దిట్టగా పేరు పొందారు. ఇప్పుడు చిరంజీవి వంటి మెగాస్టార్‌తో కలిసి, వెంకటేష్ వంటి స్టార్ నటుడి చేరికతో, తన మార్క్ కామెడీతో పాటు భారీ యాక్షన్ అంశాలను కూడా జోడించి, ప్రేక్షకులకు సరికొత్త, గుర్తుండిపోయే అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

►ALSO READ | Ram Charan Upasana: మరో బిడ్డకు తండ్రి కాబోతున్న రాంచరణ్

వెంకటేష్ చేరికతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ ముగ్గురి అద్భుతమైన కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనం రేపుతుందో చూడాలి.