Ram Charan Upasana: మరో బిడ్డకు తండ్రి కాబోతున్న రాంచరణ్

Ram Charan Upasana: మరో బిడ్డకు తండ్రి కాబోతున్న రాంచరణ్

మెగా దంపతులు రామ్ చరణ్-ఉపాసన గుడ్ న్యూస్ చెప్పారు. తమ రెండో బిడ్డకు జన్మనిస్తున్నట్లుగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. గతకొన్ని నెలలుగా ఉపాసన రెండో ప్రెగ్నెన్సీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ (2025 అక్టోబర్ 23న) ఉపాసన అధికారికంగా ప్రకటిస్తూ పోస్ట్ పెట్టారు. ‘ఈ దీపావళి పండుగ. రెట్టింపు వేడుకలు, రెట్టింపు సంతోషం’ అంటూ వీడియో రిలీజ్ చేసి ఉపాసన తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ వీడియోలో ఉపాసనకు పూలు, పండ్లు, కానుకలు అందించి పెద్దలు ఆశీర్వదించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులతో పాటుగా నాగబాబు, నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠి.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేశారు. అయితే, క్లీంకార ఫేస్ మాత్రం ఎక్కడా రివీల్ అవ్వకపోవడం విశేషం. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో మెగా వారసుడు రాబోతున్నాడంటూ ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.

రామ్ చరణ్-ఉపాసన దంపతుల వివాహం జూన్ 14, 2012న జరిగింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత 2023 జూన్ 20న మొదటిసారి ఈ మెగా కపుల్ తల్లిదండ్రులయ్యారు. తమ మొదటి పండండి ఆడబిడ్డకు "క్లిం కారా (Klin Kaara)" అని పేరు పెట్టి, పలు వేడుకలు కూడా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే, “నో ఫోటో పాలసీ”ని అనుసరిస్తూ, సోషల్ మీడియాకి చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఎప్పుడు రివీల్ చేస్తారో తెలియాల్సి ఉంది.