వెంకీ 75 టైటిల్ ఫిక్స్

వెంకీ 75 టైటిల్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ 75 మూవీ తెరకెక్కుతోంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'సైంధవ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'సైంధవ్' అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. అందులో వెంకీ లుక్‌‌‌‌ చూస్తే యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ అని అర్థమవుతోంది. వెంకీ రఫ్ లుక్, ఆయన గన్ పట్టుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌తో రూపొందే ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో వెంకటేష్‌‌‌‌ను చూపించబోతున్నామని, ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కిస్తామని మేకర్స్ చెబుతున్నారు. నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.  ప్రస్తుతం వెంకీ ‘రానా నాయుడు’ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో బిజీగా ఉన్నాడు.