
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీ బ్లాక్‌బస్టర్ టాక్తో దూసుకెళ్తోంది. మంగళవారం జనవరి14న రిలీజైన ఈ మూవీకి థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కుటుంబ సమేతంగా చూసే సినిమా కావడంతో వెంకీ మామ పొంగల్ ట్రీట్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఈ మూవీకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
ప్రముఖ ట్రేడ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం:
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇండియా వైడ్ గా రూ.25కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 18 కోట్లకి పైగా వసూలు చేయొచ్చని నిపుణులు అంటున్నారు. మరి కాసేపట్లో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ గ్రాస్ కలెక్షన్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
??????????? ????????..❤️?#SankranthikiVasthunam Captivates North America audiences, Surpasses $700K gross mark and going strong ?
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025
Extra locations & shows are being added On demand?️
Victory @VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/GJDlr0IXuq
అయితే, ఈ మూవీ ఓవర్సీస్ లో సైతం దుమ్ములేపుతోంది. ఈ సినిమాకు ఉత్తర అమెరికా ఆడియన్స్ టికెట్లను హాట్ కేకుల్లా కొంటున్నారు. దాంతో అక్కడ ఈ మూవీ $700K గ్రాస్ మార్కును అధిగమించినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 7 లక్షల డాలర్లు రాబట్టడం హీరో వెంకటేష్ కెరీర్‌లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది.
ఇక ఈ వారం ఓవర్సీస్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ఆడియన్స్ రెస్పాన్స్ దృష్ట్యా అదనపు షోలు జోడించబడుతున్నాయి అంటూ న మేకర్స్ తెలిపారు.
ALSO READ | Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...