వెంకటేశ్ కూతురు ఆశ్రితతో నాగచైతన్య కిచెన్ వీడియో

వెంకటేశ్ కూతురు ఆశ్రితతో నాగచైతన్య  కిచెన్ వీడియో

నాగచైతన్య సినిమాలతో బిజీగా ఉంటూనే హోటల్ బిజినెస్ లో రాణిస్తున్నాడు. నాగచైతన్య తన ఫ్రెండ్స్ తో  ‘షోయూ’ అనే ఫుడ్ బిజినెస్  స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా  వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత తన యూట్యూబ్ ఛానల్ లో  నాగచైతన్య  ‘షోయూ’పేరుతో లాంచ్ చేసిన క్లౌడ్ కిచెన్‏ను ఇంట్రడ్యూస్ చేశారు. నా బావా అంటూ పరిచయం చేసిన ఆశ్రిత షోయూ వంటకాల గురించి వివరించారు.  షోయు కిచెన్ మొత్తం తిరుగుతూ పలు రకాల ఫుడ్ ఐటమ్స్ ని  చూపించారు. ఆశ్రిత అడిగిన పలు ప్రశ్నలకు నాగచైతన్య చెబుతుండటం మనం వీడియోలో చూడవచ్చు.  

అయితే ఎప్పుడూ పెద్దగా కలిసినట్లుగా కనిపించని జోడి కావడంతో ఈ వీడియో  సోషల్ మీడియా గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. మీ ఇద్దరు ఒకే వీడియోలో కనిపించడం క్యూట్ గా ఉందని..దగ్గుపాటి, అక్కినేని ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి  నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

వెంకటేశ్ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు బయటి జనానికి పెద్దగా తెలియదు.  ఫ్యామిలీ పార్టీల్లో తప్ప వెంకటేశ్ భార్యా, పిల్లలు  సోషల్ మీడియాలో  కనిపించరు. అయితే వెంకటేశ్ పెద్ద కూతురు  ఆశ్రిత  ఇన్ఫినిటీ ప్లాటర్ అనే యూజర్ అనే  యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో కొత్త వంటలను పరిచయం చేస్తూ పాపులర్ అయ్యారు.