చిరు, వెంకీ చింపేస్తున్నారుగా.. షూటింగ్ సెట్స్లో సందడే సందడీ..

చిరు, వెంకీ చింపేస్తున్నారుగా.. షూటింగ్ సెట్స్లో సందడే సందడీ..

ఇద్దరు  స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే వారి అభిమానులకు అది పండుగే. టాలీవుడ్‌‌‌‌లో  అలాంటి  క్రేజీ  కాంబినేషనే చిరంజీవి, వెంకటేష్.  చిరు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ ఓ ఇంటరెస్టింగ్ రోల్ చేస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో వేసిన  భారీ సెట్‌‌‌‌లో ఈ మూవీ  షూటింగ్ జరుగుతోంది. 

గురువారం (అక్టోబర్ 23) నుంచి  వెంకటేష్ సెట్స్‌‌‌‌లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, వెంకటేష్‌‌‌‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వీడియోలో ‘వెల్‌‌‌‌కమ్ వెంకీ.. మై బ్రదర్ ’ అని  చిరంజీవి అనగా,  ‘చిరు సర్.. మై బాస్’ అని వెంకటేష్ చెప్పడం ఫ్యాన్స్‌‌‌‌కు ట్రీట్‌‌‌‌లా అనిపిస్తుంది. ఈ మూవీ  సెట్‌‌‌‌లో పండగ వాతావరణం స్పష్టంగా తెలుస్తోంది. ఎఫ్‌‌‌‌2, ఎఫ్‌‌‌‌3, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్‌‌‌‌తో అనిల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరుతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలు పెంచింది.  

ఈ సినిమాలో వెంకటేష్  లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ తెలియజేశారు.  నయనతార హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్లపై  సాహు గారపాటి,  సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.