వెంకీమామ మేకింగ్ వీడియో అదుర్స్..!

వెంకీమామ మేకింగ్ వీడియో అదుర్స్..!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీమామ. ఈ మూవీని డెరెక్టర్ బాబీ బర్త్ డే సందర్భంగా వెంకీమామ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. వీడియోలో వెంకీ, చైతు ఒకేసారి కనిపించారు. ఈ వీడియోతో ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలను పెంచేసింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీలో పాయల్‌ రాజ్‌ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న వెంకీమామను సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది యూనిట్.