కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్డీఓ డీఎల్ఆర్ఎల్) ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 75.
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 40, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 25, మెకానికల్ ఇంజినీరింగ్ 10.
ఎలిజిబిలిటీ: 2026-2027లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ లో బీఈ/ బి.టెక్ చివరి సంవత్సరంలోకి ప్రవేశించే విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. గత మూడు సంవత్సరాల్లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉన్నా అర్హులు కారు.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16.
లాస్ట్ డేట్: మే 15.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే మొదటి మూడు సంవత్సరాల్లో పొందిన మార్కుల శాతం / సీజీపీఏ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.in ను సందర్శించండి.
►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: RBIలో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

