
శ్రీవిష్ణుతో కలిసి సినిమా మొత్తం కనిపించే పాత్ర పోషించా. శ్రీ విష్ణు చాలా స్పాంటీనియస్‌గా డైలాగ్స్‌ని ఇంప్రవైజ్ చేస్తారు. ఆయన పక్కన అంతే స్పాంటేనియస్ గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్‌కి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ కార్తిక్ రాజు ముందే ఫిక్స్ అయ్యారు. ఈ కథ విన్నప్పుడే చాలా హిలేరియస్‌గా అనిపించింది. భాను, నందు డైలాగ్ వెర్షన్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. అదే ఎంటర్‌టైన్‌మెంట్‌ను థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ను నేను స్క్రీన్‌పై చూసుకోలేను. కానీ ఈ సినిమా థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి చూసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఒకే తరహా పాత్రలు చేస్తున్నానని కొందరు అంటుంటారు.. నిజానికి కామెడీ పాత్రలని ఎంచుకునే అంత వెర్సటాలిటీ ఇప్పుడు లేదు.
ముందు రైటర్స్‌ని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. రైటర్స్ కొత్త కొత్త ఆలోచనలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్తగా వస్తాయి. చాలాసార్లు మనకి రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని అందులోనే ఏదో ఒక యూనిక్‌నెస్‌ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. నావల్ల ఒక సీన్ ముందుకెళ్లడం నాకు గొప్ప ఆనందం ఇస్తుంది. ఇప్పుడున్న కాలంలో కామెడీ పండించడం చాలా కష్టం. రీల్స్ ఓపెన్ చేస్తేనే బోలెడు కామెడీ వీడియోలు కనిపిస్తాయి. థియేటర్స్‌కి వచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే అంతకుమించి ఇవ్వగలగాలి.
అలాంటి క్యారెక్టర్ కుదరాలి. అవన్నీ కుదరడం వెరీ బిగ్ చాలెంజ్. వాస్తవానికి నాకు గీత గోవిందం, అమీతుమీ, ఒకే ఒక జీవితం లాంటి చిత్రాల్లో చేసిన పాత్రలు బాగా ఇష్టం. అలాగే నేను నటించిన చిత్రాల్లో నాకు జీవితాంతం గుర్తుండిపోయేవి వెన్నెల, బిందాస్, దూకుడు. ఇక డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా లేవు. దూకుడు సినిమా తర్వాతే నా డ్రీమ్ రోల్ అయిపోయింది. మహేష్ బాబు గారి పక్కన మంచి క్యారెక్టర్ చేయడం నిజంగా డ్రీమ్ రోల్. ఇప్పుడు చేస్తుందంతా బోనస్. హీరోగా పలు కథలు వస్తున్నాయి కానీ లవ్ స్టోరీలు, పాటలు అంటున్నారు. అవి నాకు సూట్ కావని చెబుతున్నా. సరైన కామెడీ కథ కుదిరితే హీరోగా నటిస్తా. అలాగే డైరెక్షన్ కూడా చేయాలనుంది. అయితే దానికి చాలా సమయం ఉంది’’.
తొలిచిత్రం ‘వెన్నెల’నే తన ఇంటిపేరుగా మార్చుకుని, హాస్య నటుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు కిషోర్. ఇప్పటికే వందలాది చిత్రాలతో నవ్వులు పంచిన కిషోర్.. ప్రస్తుత కాలంలో కామెడీ పండించడం చాలా కష్టం అంటున్నాడు. ఇటీవల తను నటించిన ‘సింగిల్’ చిత్రంలో తన పాత్రకు మంచి ఆదరణ దక్కుతున్న సందర్భంగా ‘వెన్నెల’ కిషోర్ చెప్పిన విశేషాలు.