PSL 9: పాక్ సూపర్ లీగ్‌లో అంతే: గ్రౌండ్‌లోనే గొడవపడిన ఆటగాళ్లు

PSL 9: పాక్ సూపర్ లీగ్‌లో అంతే: గ్రౌండ్‌లోనే గొడవపడిన ఆటగాళ్లు

పాకిస్థాన్ సూపర్ లీగ్ అంటే వింతలన్నీ అక్కడే ఉంటాయేమో. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విషయంలో ఈ లీగ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తాజాగా డీఆర్ఎస్ విషయంలో ఇద్దరు కెప్టెన్లు గ్రౌండ్ లో గొడవ పెట్టుకున్నారు. వీరి వాగ్వాదం గల్లీ క్రికెట్ ను తలపిందింది. 

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా  ఇస్లామాబాద్ యునైటెడ్‌ షాదాబ్ ఖాన్, కరాచీ కింగ్స్ కెప్టెన్ షాన్ మసూద్ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. మహ్మద్ నవాజ్ వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్లో నాలుగో బంతికి అఘా సల్మాన్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఔట్ అని పెషావర్ భావించగా.. అంపైర్ దీనిని నాటౌట్ గా ప్రకటించాడు. అయితే రివ్యూ తీసుకోవడానికి షాన్ మసూద్ నిర్ణయించుకోగా అప్పటికే సమయం మించిపోయింది. ఇంతలో షాదాబ్ టైం అయిపోయిందని.. నువ్వు రివ్యూ తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పాడు. 

ALSO READ :- IND vs ENG 5th Test: రోహిత్ అరుదైన ఘనత..సెంచరీల్లో సచిన్ రికార్డ్ సమం

షాదాబ్ మాటలకు మసూద్ కోపంతో నేను అంపైర్ ను అడుగుతున్న నీకేం పని అని వాగ్వాదానికి దిగాడు. నువ్వొక పాకిస్థాన్ కెప్టెన్ వి. నీ పద్ధతి ఇదేనా.. అంటూ షాదాబ్ అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే సహచర ప్లేయర్లు వచ్చి వీరిని పక్కకు తీయడంతో వీరి మధ్య గొడవ ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.