జూన్ 20 నుంచి గ్రూప్​‑4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్​

జూన్ 20 నుంచి గ్రూప్​‑4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్​

–హైదరాబాద్, వెలుగు:  గ్రూప్- 4 మెరిట్​ లిస్ట్​లో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ఆదివారం  ప్రకటించింది. ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది.  హైదరాబాద్​లో రెండు సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ రాష్ట్ర కార్యాలయంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్​ ఉంటుందని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు హాజరుకాని,  సర్టిఫికెట్లు సమర్పించని అభ్యర్థుల కోసం ఆగస్టు 24, 27, 28, 29, 30 31వ తేదీల్లో మరో అవకాశం కల్పించినట్టు తెలిపింది. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ రోజువారి షెడ్యూల్​ను కమిషన్ వెబ్​సైట్​లో పొందుపరిచామని  పేర్కొంది.