ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్ తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధ సమస్యలతో బాధపడున్న ఆయన శనివారం(జూన్-13) చెన్నైలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. ఆయన బాఫ్టా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు హెచ్‌వోడిగా 2015 వరకు పనిచేశారు. కన్నన్ …లెజండరీ డైరెక్టర్ భీమ్‌సింగ్‌కు కుమారుడు… ప్రముఖ ఎడిటర్ బీ లెనిన్‌కు సోదరుడు కూడా. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
తమిళం, మలయాళంలో 50కి పైగా సినిమాలకు కన్నన్ పని చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి 40 సినిమాలకు పని చేశారు. వీరద్దరి కలిసి పనిచేసిన మొదటి సినిమా నిజల్‌గళ్ కాగా… చివరి చిత్రం బొమ్మలాట్టమ్.
కన్నన్ మృతితో ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం దగ్గర ఉంచుతారు. రేపు(ఆదివారం) అంత్యక్రియలను నిర్వహిస్తారు.

