బదిలీ అయినా.. ప్రమోషన్​ వచ్చినా.. ఉన్నచోటి నుంచి కదలరు గద్వాల జిల్లా వెటర్నరీ శాఖలో డిప్యూటేషన్ల బాగోతం

బదిలీ అయినా..  ప్రమోషన్​ వచ్చినా.. ఉన్నచోటి నుంచి కదలరు  గద్వాల జిల్లా వెటర్నరీ శాఖలో డిప్యూటేషన్ల బాగోతం
  • ఆఫీసర్ల అండతో సిబ్బంది ఇష్టారాజ్యం 
  • జిల్లాలో మూగజీవాలకు అందని వైద్యం 
  • మూతపడిన మూడు హాస్పిటల్స్​

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని వెటర్నరీ డిపార్టమెంట్ లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బదిలీ అయినా.. ప్రమోషన్​ వచ్చినా వెళ్లకుండా తమకు అనుకూలమైన చోటే డ్యూటీ చేస్తున్నారు. ఉన్నతాధికారులను మేనేజ్​ చేసుకుని.. బదిలీ అయిన మరునాడే ఉన్న చోటికే డిప్యూటేషన్​వేయించుకుంటున్నారు. దీంతో జిల్లాలో పశువైద్యం అందని పరిస్థితి నెలకొంది. కొన్ని వెటర్నరీ హాస్పిటల్స్​ మూత పడ్డాయన్న విమర్శలు వస్తున్నాయి. 

ఇటీవల కొందరు వెటర్నరీ అసిస్టెంట్( వీఏ)లకు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్లు (ఎల్ ఎస్ ఏ )గా ప్రమోషన్​ ఇచ్చారు. అయితే వారు తమకు కేటాయించిన చోట ఇంకా జాయిన్ కాలేదని తెలుస్తోంది. వెటర్నరీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది కర్నూల్ లో ఉంటున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో కర్నూలుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే డ్యూటీలు వేయించు కుంటున్నారు. ఒకవేళ దూరప్రాంతానికి బదిలీ అయితే క్షణాల్లో డిప్యూటేషన్ పై సేమ్ ప్లేస్ కు వస్తున్నారు. 

అటెండర్లే దిక్కు 

వెటర్నరీ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల తనగల, పులికల్, మల్దకల్ మండలం పాల్వాయి వెటర్నరీ హాస్పిటల్స్ మూతపడ్డాయి. ధరూర్ మండలం అల్లపాడు, మల్దకల్ మండలం ఎల్కూర్ వెటర్నరీ హాస్పిటళ్లలో కేవలం అటెండర్లతోనే నడుస్తున్నాయి. ఇక్కడ కనీసం వెటర్నరీ అసిస్టెంట్లు కూడాలేరు. ఆలంపూర్ వెటర్నరీ హాస్పిటల్ లో విఏ గా పని చేస్తున్న ఉద్యోగికి ప్రమోషన్ రాగా లింగన్ వాయి గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేశారు. అలంపూర్​కు తనగల చెందిన ఉద్యోగి బదిలీ అయ్యాడు.

 ప్రమోషన్​ పొందిన ఉద్యోగి లింగన్​ వాయికి వెళ్లకుండా అలంపూర్​లోనే డిప్యూటేషన్ పై కొనసాగుతున్నాడు. అలంపూర్ కు బదిలీ అయిన ఉద్యోగిని తన పలుకుబడితో మరో చోటికి డిప్యూటేషన్ పూ పంపినట్టు ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఆలంపూర్ లో పనిచేసిన ఉద్యోగి శాంతికి బదిలీ అయినా అక్కడే పని చేశారని, ప్రమోషన్​ వచ్చినా కూడా అక్కడే డిప్యూటేషన్​ మీద కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఎలుకూరులో జేవీవో గా పనిచేస్తున్న శ్రీశైలం డిప్యూటేషన్ పై లింగన్ వాయి కి వెళ్లగా అటెండర్​ మాత్రమే ఉన్నాడు.

ప్రమోషన్స్ వచ్చిన జాయిన్ కాలే

 ఇటీవల 8 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఇందులో ఎవరు తమకు కేటాయించిన చోట జాయిన్ కాలేదు. ఇందులో ఒకరు ఎల్కూరులో జాయిన్​ కావాల్సిఉండగా డిప్యూటేషన్ పై లింగన్ వాయికి వెళ్లారు. అధికారులు తమకు నచ్చిన ఉద్యోగులు అడిగిందే ఆలస్యమన్నట్టు కోరిన చోటికి డిప్యూటేషన్​ పై పంపుతున్నారు. అధికారుల అండతో కొందరు ఉద్యోగులు డ్యూటీలు ఎగ్గొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరూర్ లోని వెటర్నరీ హాస్పిటల్​ డాక్టర్​ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయన తీరును ప్రశ్నించినందుకు అల్లపాడు లో పనిచేస్తున్న ఉద్యోగిని వేరే ప్లేస్ కి బదిలీ చేయించారని అంటున్నారు. గద్వాలలో హాస్పిటల్​ 12 గంటలకే మూసివేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 

పశువుల వైద్యానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

ప్రమోషన్లు వచ్చిన వారు త్వరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. ఎక్కడ కూడా పశువుల వైద్యానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. డిప్యూటేషన్ ల వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.- వెంకటేశ్వర్లు, జిల్లా వెటర్నరీ ఆఫీసర్, గద్వాల