మన పండ్లు, కూరగాయలు ఫారెన్ కు ఎక్స్ పోర్ట్

మన పండ్లు, కూరగాయలు ఫారెన్ కు ఎక్స్ పోర్ట్

న్యూఢిల్లీ : రైతులు పండించిన పండ్లు, కూరగాయలకు కరోనా కారణంగా మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. కృషి ఉడాన్ పథకంలో భాగంగా ఫారెన్ కంట్రీలకు వీటిని ఎక్స్ ఫోర్ట్ చేస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియా రెండు ఫ్లైట్లను నడుపుతోంది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ను లండన్, జర్మనీలో ని ఫ్రాంక్ ఫర్ట్ కు ఎగుమతి చేస్తోంది. సోమవారం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి ప్రూట్స్, వెజిటెబుల్స్ తో లండన్ లో దిగనుంది. మరో ఫ్లైట్ ను ఈ నెల 15 న ఫ్రాంక్ ఫర్ట్ కు పంపించనున్నారు. విదేశాలకు వీటిని ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మంచి ఆదాయం రానుంది. కృషి ఉడాన్ పథకాన్ని రైతులు విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కేంద్రం గతంలోనే ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం రైతులు పండించిన పండ్లను పెద్దగా గిరాకీ లేదు. ఇదే సమయంలో ఫారెన్ కంట్రీస్ లో వీటి అవసరం ఉండటంతో అక్కడికి ఎక్స్ పోర్ట్ చేస్తున్నారు. తిరిగి వచ్చేప్పుడు ఇవే ఫ్లైట్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ ఎక్విప్ మెంట్ ను తీసుకొస్తారు. ” విదేశాలకు పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయటం ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఎగుమతులు, దిగుమతులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి ” అని ఓ అధికారి తెలిపారు. కరోనా ఎఫెక్ట్ మొదలైన నాటి నుంచి ఎయిర్ ఇండియా దాదాపు 119 ఫ్లైట్లను వివిధ దేశాలకు నడుపుతోంది. అక్కడ ఉన్న మన వాళ్లను తీసుకురావటంతో పాటు మెడిసిన్స్, ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ను ఎక్స్ పోర్ట్ చేస్తోంది.