వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలి

వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలి

ట్యాంక్ బండ్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. మొజంజాహీ మార్కెట్ చౌరస్తాలో వీహెచ్ పీ, భజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వినాయక నిమజ్జనంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో  ఆందోళన చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వినాయక్ సాగర్ లోనే గణేష్ నిమర్జనం చేయాలని సీతాపల్ మండిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న బీజేపీ నేతలను అరెస్టు పోలీసులు అరెస్ట్ చేసి చిలకలగూడ పీఎస్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో  మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీక రెడ్డి..హరి పలువురు ఉన్నారు.