బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు పగుడాకుల బాలస్వామి, రమేశ్ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా, వధ ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
హైవేలు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు పెంచాలని, అక్రమ వధశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్వామీజీలు దుర్గానంద, సర్వేశ్వర శివయోగి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
