పార్లమెంటు సమావేశాలకు సహకరించండి .. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్‌‌‌‌‌‌‌‌ పిలుపు

పార్లమెంటు సమావేశాలకు సహకరించండి .. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్‌‌‌‌‌‌‌‌ పిలుపు

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ ఖడ్ పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు సాగేందుకు సహకరించాలని కోరారు. పార్లమెంటు సభ్యులు అసభ్య పదాలను ఉపయోగించొద్దని సూచించారు. న్యూఢిల్లీలో రాజ్యసభ ఇంటర్న్ ల బృందాన్ని ఉద్దేశించి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడారు. టెలివిజన్ డిబేట్లలో ఉపయోగించే దూషణలతో తమ చెవులకు చిల్లులు పడ్డాయని తెలిపారు. 

‘‘మనకు భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు. కానీ, మన హృదయం ఎందుకు కఠినంగా ఉండాలి?. పరస్పర గౌరవాన్ని కలిగి ఉండండి. ఒక పార్టీ, మరొక పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అనుచితమైన భాషను ఉపయోగించొద్దు”  అని జగదీప్ ధన్ ఖడ్ సూచించారు.