విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’

విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’

రవి రావణ్ రుద్ర, శ్రీయ తివారి  జంటగా సైఫుద్దీన్ మాలిక్ దర్శక నిర్మాతగా రూపొందించిన  సినిమా ‘విచిత్ర’. షూటింగ్‌‌తో పాటు ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు  పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ‘అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది.

తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచింపజేసేలా ఉంటుంది. ఓ మంచి ఫ్యామిలీ డ్రామాగా కుటుంబంతో కలిసి చూసే చిత్రమిది. జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి , రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో  నటించారు. కొత్త ఏడాది ప్రారంభంలో  ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. నిజాని అంజన్ సంగీతం అందిస్తున్నాడు.