
బ్యాడ్ న్యూస్ ఎప్పుడో..! మీరు చదివింది నిజమే..త్రిప్తీ డిమ్రీ నటించిన బ్యాడ్ న్యూస్ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో త్రిప్తీ బిజీబిజీగా ఉంది. సినిమా ప్రమోషన్ కోసం ఈ అమ్మడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీగా వచ్చేస్తున్నారు. వారిని చూస్తున్న త్రీప్తీ ఉబ్బి తబ్బిబ్బై పోతుందట. ఏ నటికైనా ఆదరణే ముఖ్యం కదా అంటూ ముసిముసి నవ్వులతో హొయలు పోతుందట.
హిట్ సినిమాలో చిన్న రోల్ అయినా పాపులారీటీ రావడం పక్కా అన్న విషయం అందరికీ తెలిసిందే. యానిమల్ లో నటించింది చిన్న పాత్రే అయినా పాన్ ఇండియా లెవల్ లో క్రేజీ సంపాదించిందీ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ నటీమణిగా మారిపోయింది. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే త్రిప్తీ..ఏ ఫొటో అప్ లోడ్ చేసినా హాట్ టాపిక్ గానే మారుతోంది. ఇన్ స్టా వేదికగా డిజైనర్ దుస్తుల్లో దూరిన ఫోటోల్ని వదులుతోంది. తనదైన మార్క్ ఎలివేషన్లతో ఆకట్టుకుంటోంది.
తాజాగా అమ్మడు మరో స్టైలిస్ పిక్ తో వచ్చేసింది. వైట్ కలర్ ప్రాక్ దుస్తుల్లో అమ్మడు ముస్తాబైన విధానానికి యువత ఫిదా అవుతోంది. నెక్ నుంచి హ్యాండ్స్ బాటమ్ ఒరకూ ఒకే డిజైన్ లో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ లో దుస్తుల్లోనూ తనదైన మార్క్ ఎలివేషన్ కి చాన్స్ ఇచ్చింది. అమ్మడి మేకప్, హెయిర్ స్టైల్, ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ అన్నీ త్రిప్తీని హైలెట్ చేస్తున్నాయ్.