కత్రినాకు నేను పర్ఫెక్ట్ హస్బెండ్‌ను కాను: విక్కీ కౌశల్

కత్రినాకు నేను పర్ఫెక్ట్ హస్బెండ్‌ను కాను: విక్కీ కౌశల్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ బంధంలో అడుగుపెట్టి ఏడాది దాటింది. వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా పర్ఫెక్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ఇదే విషయాన్ని విక్కీ ఎదుట ప్రస్తావించగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. తాను కత్రినాకు ఫర్పెక్ట్ హస్బెండ్ ను కానంటూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. తనలోని లోపాలను బహిరంగంగా చెప్పిన విక్కీ కౌశల్.. తాను ఏ విధంగానూ పరిపూర్ణమైన వ్యక్తిని కాదని చెప్పారు. భర్తగా, కొడుకుగా, స్నేహితుడిగా, నటుడిగా .. ఇలా ఏ రోల్ లోనూ పర్ఫెక్ట్ పర్సన్ కానని అన్నారు. ప్రస్తుతం పర్ఫెక్షనిస్టుగా మారాలనుకుంటున్నాని, అందుకోసం చాలా కష్టపడుతున్నానని చెప్పారు.  

“పరిపూర్ణంగా ఉండాలనుకోవడం ఎండమావి లాంటిదన్న విషయం మీకు తెలుసా?" అని ప్రశ్నించిన విక్కీ.. అసలు ఎవరూ ఆ దశకు చేరుకోలేరని అన్నారు. అందుకే తాను పరిపూర్ణమైన భర్తనని అనుకోనని .. కానీ తాను పర్ఫెక్ట్ గా ఉండడానికి, ఉత్తమ భర్త అనిపించుకోవడానికి ప్రయత్నిస్తానని విక్కీ చెప్పారు. నిన్నటి కన్నా నేడు మెరుగ్గా ఉండేందుకు, ఏం చేసినా ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఇక కత్రినాతో కలిసి ఉండటంపై స్పందించిన విక్కీ.. ఒక వ్యక్తితో జీవించడం ప్రారంభించినప్పుడు లేదా మీకు తోడుగా వేరొక వ్యక్తి ఉన్నప్పుడు మీరు చాలా నేర్చుకుంటారని చెప్పారు. అది మిమ్మల్ని ఒక వ్యక్తిగా ఎదగడానికి సహకరిస్తుందని అన్నారు.