- పేషెంట్లలో పెరుగుతున్న పాజిటివ్ మైండ్ సెట్
- ట్రీట్మెంట్తోపాటు డైలీ వాకింగ్, మెడిటేషన్
- హెల్దీ డైట్, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్
- వీడియో కాల్స్‌తో ఫ్యామిలీ మెంబర్స్‌కి టచ్‌లో..
దునియాను షేక్ చేస్తున్న కరోనా గ్రేటర్లో వణుకు పుట్టిస్తోంది. మన గల్లీలోనో, పక్క ఆఫీసులోనో వైరస్ సోకిందంటేనే హడలిపోతున్నారు చాలామంది. మరి, ఐసోలేషన్‌లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాళ్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్పరిస్థితి? మొదట్లో వాళ్లూ పైలాంటి భయాలే ఎదుర్కొన్నారు. ఇప్పుడు మాత్రం పాజిటివ్ మైండ్ సెట్‌తో వీలైనంత త్వరగా కోలుకునేందుకు ట్రై చేస్తున్నారు. తమను తాము మోటివేట్ చేసుకుంటూ.. వీడియో కాల్స్‌తో ఫ్యామిలీ మెంబర్స్లోనూ ధైర్యం నింపుతున్నారు.
షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని..
కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినవాళ్లు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆ టైమ్‌లో వైరస్ సోకిందని భయపడకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో దాన్నుంచి బయటపడడంపై ఫోకస్ చేస్తున్నారు. హాస్పిటల్లో ఇస్తున్న ఫుడ్, మెడిసినే కాకుండా ఫ్రూట్స్, జ్యూస్‌లు, ఇమ్యూనిటీ పెంచే లిక్విడ్స్ తీసుకుంటున్నారు. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండేందుకు మార్నింగ్ నిద్ర లేవగానే ఎవరికి వారు యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటివి చేసుకుంటున్నారు. హాట్, లెమన్ వాటర్ తాగుతున్నారు. డైలీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అవుతున్నారు. మరికొందరు ఎక్కువ టైం నేచర్‌లో గడుపుతూ రిలాక్స్ అవుతున్నారు.
హోం ఐసోలేషన్‌లో ఇలా…
వైరస్ సింప్టమ్స్ లేకపోవడం వల్ల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వాళ్లూ ప్రాపర్ డైట్ మెయింటెన్ చేస్తున్నారు. ఇంట్లోనే సెపరేట్ రూమ్‌లో ఉంటూ మెడికేషన్ ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో ఫోన్, వీడియో కాల్స్ మాట్లాడుతూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నారు.
వీడియో కాల్స్‌తో రిలీఫ్..
ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌ను ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసే ఆప్షన్ లేదు. మొదట్లో తమ పరిస్థితి ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించి వారిని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక పెషెంట్లు వాయిస్ కాల్స్ మాట్లాడేవారు. ప్రస్తుతం డైలీ వీడియో కాల్స్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి రిలీఫ్ పొందుతున్నారు. కరోనాతో తాను 5 రోజులుగా నేచర్ క్యూర్ హాస్పిటల్ ఐసోలేషన్‌లో ఉంటున్నానని, పిల్లలను చూడాలనిపించినప్పుడల్లా వీడియో కాల్స్ చేస్తున్నానని పేషెంట్ శ్రీకర్ చెప్పాడు.
భయం సొల్యూషన్ కాదు
కరోనా వచ్చిందని తెలియగానే డీలా పడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. నాకు జ్వరమని హాస్పిటల్‌కి వెళ్తే టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. మొదట్లో వారి గురించి భయపడ్డా. కానీ భయం సొల్యూషన్ కాదని ధైర్యం తెచ్చుకున్నా. ఐసోలేషన్ సెంటర్లో మార్నింగ్ యోగా, వాకింగ్ చేస్తా. నేనే జ్యూస్ చేసుకుంటున్నా. హాస్పిటల్లో మంచి ఫుడ్ ఇస్తున్నరు. డ్రై ఫ్రూట్స్ తెప్పించుకుని తింటున్నా. ఇంట్లో వాళ్లతో డైలీ వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్లు కూడా ధైర్యంగానే ఉన్నారు. కొద్దిరోజుల్లో పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఏర్పడింది.
‑ శివ, కరోనా పేషెంట్
డైలీ వీడియో కాల్స్ చేస్తుంటా
నీరసంగా ఉందని గాంధీకి వెళ్తే కరోనా అని తేలింది. మొదట్లో కంగారు పడ్డా. ఇంట్లో వాళ్లు భయపడ్డారు. వారం నుంచి ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇంట్లో వాళ్లు టెన్షన్ అవకుండా ముందు నేను స్ట్రాంగ్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యా. నేను ధైర్యంగా ఉన్నానని చెప్పడానికి డైలీ వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నా.
‑ మహేశ్, కరోనా పేషెంట్

