వర్షం లెక్కచేయకుండా .. డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం నిరాహార దీక్ష..

వర్షం లెక్కచేయకుండా .. డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం నిరాహార దీక్ష..

హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్ డబుల్ బెడ్ రూం ఇండ్ల బాధితులు నిరాహార దీక్షకు దిగారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ఉన్న గుడిసెలు ఖాళీ చేయించి.. ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా రోడ్డు న పడేశారని మన్సూరాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీ వాసులు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వర్షం సైతం లెక్క చేయకుండా దీక్షలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

 కూలీ పనులు చేసుకుంటూ గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే.. మీకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం.. గుడిసెలు ఖాళీ చేయండని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 2016లో గుడిసెలు ముందు నిల్చోబెట్టి ఫొటోలు తీసుకున్నారని..అర్హులైన స్థానికులకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించారని ఆరోపించారు.  ఏండ్ల తరబడి ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నామని.. తమకు న్యాయం జరగకపోతే పోరాటం ఉదృతం చేస్తామని.. నిరాహారదీక్ష కొనసాగిస్తామని  నాంచారమ్మ బస్తీ వాసులు హెచ్చరించారు.