కోర్టు ఆదేశాలున్నా కూల్చివేశారు.. అమీన్​పూర్​ కృష్ణారెడ్డిపేట బాధితుల ఆవేదన

కోర్టు ఆదేశాలున్నా కూల్చివేశారు.. అమీన్​పూర్​ కృష్ణారెడ్డిపేట బాధితుల ఆవేదన

ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు ఆదేశాలున్నా తమ భవనాలు కూల్చివేశారని సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​మండలం కృష్ణారెడ్డి పేట బాధితులు ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆవేదన వ్యక్తం చేశారు. 164 సర్వే నంబర్​లో తమ భవనాలు ఉన్నాయని, అక్కడి తహసీల్దార్​హైడ్రా అధికారుల ద్వారా వాటిని కూల్చివేయించారని చెప్పారు. రెండో తేదీతో ఉన్న నోటీసును14న గోడకు అంటించి వెళ్లిపోయారని, 22న వచ్చి కనీసం సమయం ఇవ్వకుండా కూల్పివేశారన్నారు. దీనివల్ల తమకు రూ. కోట్ల నష్టం జరిగిందని వాపోయారు. కోర్టుకు వెళ్లినందుకే తహసీల్దార్​ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.