నిస్సహాయులకు న్యాయ సాయం విక్టీమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ : కన్వీనర్ గిరిప్రసాద్

నిస్సహాయులకు న్యాయ సాయం విక్టీమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ : కన్వీనర్ గిరిప్రసాద్

బషీర్​బాగ్​,వెలుగు: రాష్ట్రంలోని ఎలాంటి  ఆధారం లేని మహిళలు,  నిస్సహాయులకు విక్టీమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ కన్వీనర్ కళ్లె నాగరాజా గిరిప్రసాద్ శర్మ తెలిపారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ట్రస్ట్ కో-కన్వీనర్ మామిళ్లపల్లి విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కోర్టులు, పోలీస్ స్టేషన్ల విషయంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి తమ ట్రస్ట్ కృషి చేస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు , చిట్ ఫండ్స్, ఆర్థిక మోసాలు, గృహహింస విషయాల్లో బాధితుల పక్షాన నిలబడుతామన్నారు. ఎవరికైనా సాయం కావాలంటే 97016 09689 నంబర్​లో సంప్రదించాలని సూచించారు.