Venkatesh: నీకు వీడ్కోలు: నువ్వు లేని శూన్యత మాటల్లో చెప్పలేనిది.. వెంకటేష్ ఎమోషనల్

Venkatesh: నీకు వీడ్కోలు: నువ్వు లేని శూన్యత మాటల్లో చెప్పలేనిది.. వెంకటేష్ ఎమోషనల్

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన పెంపుడు శునకం 'గూగుల్' చనిపోయిందనే వార్తను పంచుకుంటూ ఫోటోలు షేర్ చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 1న) వెంకటేష్ తన సోషల్ మీడియా వేదికగా గూగుల్తో ఉన్న ఆత్మీయ క్షణాలను గుర్తుచేసుకుంటూ వీడ్కోలు పలికాడు. 

'నా ప్రియమైన గూగుల్. గత 12 సంవత్సరాలుగా మా జీవితాల్లో నువ్వు భాగమయ్యావు. అందమైన జ్ఞాపకాలని ఇస్తూ.. ఎంతో ప్రేమని పంచావు. నువ్వే మా సన్‌షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు లేని శూన్యత మాటల్లో చెప్పలేనిది. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను డియర్ ఫ్రెండ్' అని వెంకటేష్ తన పోస్ట్లో విచారం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో వెంకీ స్మైల్తో కుక్క పక్కన కూర్చుని ఉంటే, మరో ఫోటోలో గార్డెన్‌లో గూగుల్ తలను తాకుతూ ఆత్మీయంగా కనిపించారు. ఈ క్రమంలో వెంకీ తోటి సెలెబ్రెటీలు, ఆయన ఫ్యాన్స్ 'బీ.. స్ట్రాంగ్ వెంకీ మామ..ఇది నిజంగా బాధాకరం' అంటూ పోస్టులు పెడుతున్నారు. 

ALSO READ : 'ఉస్తాద్ భగత్ సింగ్' పోస్టర్ రిలీజ్..

ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే త్రివిక్రమ్తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ‘వెంకటరమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అనిల్ రావిపూడి- చిరు మూవీలో కీలక పాత్రలో నటించనున్నాడు. అలాగే, ‘దృశ్యం3’, అనిల్ తో సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం లైన్లో ఉన్నాయి.