విక్టరీ వెంకటేష్ సైంధవ్ అప్డేట్.. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్ తో క్లైమాక్స్

విక్టరీ వెంకటేష్ సైంధవ్ అప్డేట్.. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్ తో  క్లైమాక్స్

విక్టరీ వెంకటేష్(Venkatesh హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’(Saindhav). శైలేష్ కొలను( Sailesh Kolanu దర్శకత్వంలో ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.  లేటెస్ట్ గా ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్లైమాక్స్ కంటిన్యూ గా 16 డేస్ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా షూట్ కంప్లీట్ చేశారని వీడియో రిలీజ్ చేశారు. ఈ షూట్ లో 8 మంది యాక్టర్స్ తో పాటు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ పాల్గొన్నారని పేర్కోన్నారు. 

ఈ సైంధవ్ కీలకమైన క్లైమాక్స్ షెడ్యూల్ ను కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య పూర్తి చేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు.  హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్ ప్యాక్డ్ క్లైమాక్స్ ఎపిసోడ్‌  ఈ మూవీలో అద్దిరిపోతుందని సమాచారం. అలాగే ఫ్యాన్స్ కోసం ఈ మూవీ నుంచి విక్టరీ వెంకటేష్ ఫెరోషియస్ లుక్స్ తో ఉన్న ఫోటో ను షేర్ చేశారు. ఈ అప్డేట్ తో విక్టరీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 

రీసెంట్ గా ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అంటూ బేబీ సారా ఇందులో గాయత్రిగా కనిపించనుందని రివీల్ చేశారు. ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో పాప వెంకటేష్‌‌‌‌ను పట్టుకోగా..వెంకీ సీరియస్‌‌‌‌ లుక్‌‌‌‌లో గాయాలతో కనిపిస్తున్నారు. 

హై-ఆక్టేన్ యాక్షన్‌‌‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా రిలీజ్ కానుంది.