బంపరాఫర్: Vida V1 Pro ఎలక్ట్రిక్ బైక్పై 5 Years బ్యాటరీ వారెంటీ

బంపరాఫర్: Vida V1 Pro ఎలక్ట్రిక్ బైక్పై 5 Years బ్యాటరీ వారెంటీ

హీరో మోటో కార్ప్ ..Vida V1 Pro  ఎలక్ట్రిక్ బైక్ పై  మెయింటెనెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మెయింటెనెన్స్ ప్యాకేజీ తో రూ. 27వేల విలువైన సర్వీసింగ్ లాభాలను పొందొచ్చు. దీంతోపాటు ఫ్రీ ఛార్జింగ్, ఫ్రీ సర్వీసింగ్ ను పొందవచ్చు. కస్టమర్లు ఈ ఆఫర్  ఏప్రిల్ 31, 2024 వరకు వినియోగించుకోవచ్చు. 

Vida అడ్వాన్స్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీతో బెనిఫిట్స్ 

  •  5 సంవత్సరాల బ్యాటరీ వారెంటీ, లేదా 60 వేల కిలోమీటర్ల వరకు రెండు బ్యాటరీలపై వారెంటీ 
  • 2వేలకు పైగా  Vida ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద ఫ్రీ ఛార్జింగ్ 
  • Vida  అన్ని వర్క్ షాపులలో ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. 
  • 24x7గంటల రోడ్ సైడ్ అసిస్టెన్సీ 
  • My Vida App లో కనెక్టింగ్, సేఫ్టీ ఫీచర్లు 

Vida V1 Proలో 3.94kwh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి రీచార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా 80 kmph వేగంతో ప్రయాణించొచ్చు. కేవలం 3.2 సెకన్లలో 40 Kmph  వరకు వేగాన్ని అందుకోవచ్చు. V1 Pro OTA (ఓవర్ ది ఎయిర్) అప్ డేట్ చేసుకునే విధంగా 7 అంగుళాల TFT ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, బూస్ట్ మోడ్, టూ వే థొరెటల్, కీలెస్ ఆపరేషన్ ఆప్షన్లు ఉన్నాయి.

Vida V1 Pro  ధర రూ. 1,26,200(ఎక్స్ షోరూమ్ FAME  2 సబ్సిడీలతో సహా )  మార్చి 31,2024 నాటికి  సబ్సిడీ ముగుస్తుంది.