
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. కూనూరులోని ఆయన ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ఒక చిరుతపులి, బ్లాక్ పాంతర్ సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ విజువల్స్ను హర్ష్ గోయెంకా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
This majestic creature was spotted outside our Coonoor home. A reminder that we are guests in their territory. #RespectNature pic.twitter.com/NaNAi1NnPy
— Harsh Goenka (@hvgoenka) August 4, 2024
అంతేకాదు.. #RespectNature హ్యాష్ ట్యాగ్తో.. కూనూరులోని తన ఇంటి బయట ఈ గొప్ప జీవులు కనిపించాయని.. వాటి రాజ్యంలో మనం అతిథులమనే విషయాన్ని గుర్తుచేశాయని పోస్ట్లో రాసుకొచ్చారు. జులై 30న సాయంత్రం సమయంలో ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.