Viral Video: అయ్యప్ప ఆలయంలో నాగుపాము.. ఎక్కడంటే

Viral Video:  అయ్యప్ప ఆలయంలో నాగుపాము.. ఎక్కడంటే

తమిళనాడు మధుర అయ్యప్పఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది.   మధురై అయ్యప్ప ఆలయంలో ఐదు అడుగుల నాగు పాము కనిపించింది. తెల్లవారుజామున స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు పూజారి తలుపు తీశాడు.  తలుపు చాటునుంచి బుసలు కొట్టే శబ్దాన్ని గమనించిన పూజారి ఒక్కసారిగా భయపడ్డాడు.  దీంతో అలెర్ట్ అయిన  పూజారి రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడంతో వెంటనే ఆలయానికి వచ్చి పామును రక్షించారు.  పామును నాగమలై అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. శబరిమల యాత్ర ప్రారంభమైన నవంబర్, డిసెంబర్ నెలల్లో అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాము రావడంతో కలకలం రేగింది.