మందు తాగిన పిల్లి.. ఇలా నడుస్తుంది.. ఏం చేష్టలు ఇవీ..

మందు తాగిన పిల్లి.. ఇలా నడుస్తుంది.. ఏం చేష్టలు ఇవీ..

కల్లు తాగిన కోతి.. పాత సామెత.. మందు తాగిన పిల్లి.. లేటెస్ట్ ట్రెండ్. కోతి అంటే ఎలా చేస్తుందో తెలుసు.. మరి మందు తాగిన పిల్లి ఎలా నడుస్తుంది.. మత్తెక్కిన పిల్లి ఏం చేస్తుంది.. మందు తాగిన పిల్లి ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.. ఈ కింద వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. 

తమిళనాడు రాష్ట్రం నుంచి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ అయిన ఈ వీడియోపై.. ఇప్పుడు నెటిజన్లు.. జంతు పరిరక్షణ వారు తీవ్ర అభ్యంతరంతోపాటు.. ఏంటీ పిల్ల చేష్టలు అంటూ మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మందుబాబులు ఫూటుగా మద్యం తాగి రోడ్లపైన చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. మందు బాగా ఎక్కేసిన క్రమంలో వారు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియదు. ఈ క్రమంలోనే వారు చేసే ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ చూసి తెగ నవ్వుకుంటారు నెటిజన్లు. కాగా, తాజాగా ఓ పిల్లి మందు తాగి రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

జస్విందర్​ కౌర్​  అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో క్యాట్ వెరీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తోంది. అవి చూసి నెటిజన్లు తెగ సంబుర పడిపోతున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. ఓ మందు దుకాణం దగ్గర ..పిల్లి.. మందు తాగిన వారు అడ్డగోలుగా తూలుతూ నడిచే విధంగా నడుస్తోంది. ఈ వీడియో చూస్తే ఈ క్యాట్​ డ్రింక్​ చేసిందా అనే అనుమానం వస్తుంది.  క్యాట్ నడవలేకపోతున్నది. అలా అతి కష్టంగా అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తున్నది. అలా వెనుక రెండు కాళ్లు సపోర్ట్ తీసుకున్నా కానీ అడుగులు ముందుకు పడటం లేదు. ఎట్టకేలకు ఒక్కో అడుగు ముందరకు వేసింది.