బావ‌లు స‌య్యా.. సై.. ప్ర‌భుత్వ ఆఫీస‌ర్ బ‌దిలీ పార్టీలో.. రికార్డింగ్ డ్యాన్సులు

బావ‌లు స‌య్యా.. సై.. ప్ర‌భుత్వ ఆఫీస‌ర్ బ‌దిలీ పార్టీలో.. రికార్డింగ్ డ్యాన్సులు

బిహార్ బ్యూరోక్రసీకి ఇబ్బంది కలిగించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖగారియాలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) కోసం ఏర్పాటు చేసిన వీడ్కోలు 'పార్టీ' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ అధికారి బదిలీ అవుతున్న క్రమంలో ఈ పార్టీని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వీడియోలో "బార్ గర్ల్స్" భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తుండగా.. అందుకు అక్కడే ఉన్న అధికారులు ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ALSOREAD :ఆంధ్రోడా అంటూ చిల్లర కామెంట్స్.. అందుకే ఈ సైలెన్స్

వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ (DM) విచారణకు ఆదేశించారు. కాగా ఈ వీడియో జులై 12కి చెందినట్టుగా సమాచారం. BDO సునీల్ కుమార్‌కు వీడ్కోలు పలికేందుకు బెల్దౌర్ బ్లాక్ ఆవరణలో ఆర్కెస్ట్రా పార్టీ ఏర్పాటు చేశారు. బార్ గర్ల్ స్వయంగా వేదికపై డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించే వీడియోలో.. పార్టీలో ఉన్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం వరకు డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే పార్టీని నిర్వహించడానికి వారు ఎటువంటి అనుమతి తీసుకోవడం గానీ, సమాచారం ఇవ్వడం గానీ జరగలేదని పలు నివేదికల ప్రకారం తెలుస్తోంది.