బరువులెత్తుతూ స్పూర్తినిస్తోన్న 100 ఏండ్ల పవర్‌లిఫ్టర్

బరువులెత్తుతూ స్పూర్తినిస్తోన్న 100 ఏండ్ల పవర్‌లిఫ్టర్

ప్రస్తుతకాలంలో 60 ఏండ్లకే కాళ్ల నొప్పులు, నడుం నొప్పి అంటూ ఏ పనిచేయలేని స్థితిలో ఉంటున్నారు. కానీ, ఓ 100 ఏండ్ల బామ్మ మాత్రం నాకు సాటెవరంటూ.. వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మాజీ పవర్‌లిఫ్టర్ ఎడిత్ ముర్వే.. ఈ వారం తన 100వ పుట్టినరోజును జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఆమె బరువులెత్తిన వీడియోను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఎవరైనా చూస్తే వావ్ అంటూ నోరెళ్లబెట్టాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఆమె వీడియో ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని నిరూపించింది ఈ బామ్మ. తన 94 ఏళ్ల వయసులో పవర్‌లిఫ్టింగ్ ప్రారంభించిన ఈ బామ్మ.. పలు పోటీలలో పాల్గొన్ని అవార్డులు కూడా గెలుచుకుంది.