లక్నోలో మహిళపై వేధింపుల ఘటనపై సీఎం యోగి సీరియస్.. డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ సస్పెండ్

లక్నోలో మహిళపై వేధింపుల ఘటనపై సీఎం యోగి సీరియస్.. డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ సస్పెండ్

లక్నోలో వర్షపు నీరు చిమ్మూతూ పోకిరీలు మహిళను వేధించిన ఘటన బుధవారం జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహిళా వేధింపుల వీడియోపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సిరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీసీపీ ఈస్ట్, అదనపు డీసీపీ ఈస్ట్ లను శుక్రవారం ఆగస్టు 2, 2024న బదిలీ చేశారు. గౌమతినగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. 

ఈ ఘటనలో నలుగురు నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా  ప్రధాన నిందితులు పవన్ యాదవ్, సునీల్ కుమార్ లను సంఘటన జరిగిన రోజునే అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు మహ్మద్ అరబాజ్, విరాజ్ సాహులను కూడా అరెస్ట చేశారు. గురువారం సాయంత్రానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లక్నోకు చెందిన మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. 

యూపీ ప్రభుత్వ జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా తక్షణమే నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం నాడు ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ సంఘటన సిగ్గుచేటని అన్నారు. సీఎం ఆదేశాలను మేరకు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీసీపీ ఈస్ట్, ఏడీసీపీ, ఈస్ట్, ఏసీపీ గోమతినగర్ లను బదిలీ చేశారు.  గోమతీ నగర్ ఇన్ స్పెక్టర్ సమతా ములక్ చైకీ ఇంఛార్జీ, చౌకీలోని పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ  చేశారు. 

మరోవైపు మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీసు టీంలను ఏర్పాటు చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.