ప్యారడైజ్ బేకరీలో ఎలుకల సంచారం..నెట్టింట్లో వీడియో వైరల్

ప్యారడైజ్ బేకరీలో ఎలుకల సంచారం..నెట్టింట్లో వీడియో వైరల్
  • నిర్వాహకులకు ఫుడ్​ సేఫ్టీ అధికారుల నోటీసులు

బషీర్​బాగ్, వెలుగు: ఐమ్యాక్స్ సమీపంలోని ప్రముఖ ప్యారడైజ్ బేకరీలో ఎలుకల సంచారం వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ కస్టమర్ టీ తాగడానికి బుధవారం ఉదయం బేకరీకి వెళ్లగా, అక్కడ ఉన్న బిస్కెట్స్ బాక్స్ మధ్య నుంచి ఎలుకలు బయటకు రావడంతో సెల్​ఫోన్​లో వీడియో తీశాడు. ఇదేంటని నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. 

దీంతో సదరు వీడియోను కస్టమర్ సోషల్​మీడియాలో పోస్ట్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులను ట్యాగ్ చేశాడు. వీడియో కాస్త వైరల్ కావడంతో బేకరీ నిర్వాహకులు దిగొచ్చారు. బిస్కెట్స్ బాక్స్​ను తొలగించి, మరోసారి ఇటువంటి ఘటనలు రిపీట్​కాకుండా చూస్తామన్నారు. అయితే, ఈ వీడియో ఆధారంగా బేకరీ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు