మనుషులు తాగే బీరురా అది : ఫ్యాక్టరీలో బీరు కంటైనర్ లో చుచ్చూ పోసిన పనోడు

మనుషులు తాగే బీరురా అది : ఫ్యాక్టరీలో బీరు కంటైనర్ లో చుచ్చూ పోసిన పనోడు

ఎంజాయిమెంట్ కోసమని బీరు చుక్కేస్తున్నారా.. బాధను మర్చిపోయేందుకు బీరు బాటిల్ ఖాళీ చేస్తున్నారా.. వీకెండ్ పార్టీల్లో బీరు ఆర్డరిస్తున్నారా.. అంతెందుకు బీరు తాగకుండా మీరు ఉండలేకపోతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే..   

ఇంతకీ ఈ వార్త ఏంటంటే.. ఈ వీడియో చూస్తే మీరు గతంలో తాగిన బీరును కూడా కక్కేస్తారు.  బీర్ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి చేసిన పని గురించి తెలిస్తే గతంలో తగిన బీర్ కూడా వర్తమానంలో బయటకి కక్కేస్తారు. ఇంతకీ ఎం అయింది అనుకుంటున్నారా..? ఓ ఉద్యోగి ఎక్కడ చోటు లేనట్టు బీర్ ట్యాంక్ లో మూత్ర విసర్జన చేసాడు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది. 

వివరాలలోకి వెళ్తే.. 

చైనా లో ప్రముఖ బీర్ కంపెనీ అయిన సింగ్‌టావో బ్రూవరీ గోదాములో క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఓ ఉద్యోగి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్‌ లోకి మూత్ర విసర్జన చేశారు.   ఆ కంపెనీకి సంబంధించిన మరో ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఘటన వెలుగు చూసింది.  ఆ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ ని కైవసం చేసుకుని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ఈ వార్త తెలుసుకున్న కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది. మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీలు చేసింది. 

సింగ్టావో చైనా యొక్క అగ్ర బీర్ ఉత్పత్తిదారులలో ఒకటి. కాగా సంఘటనపై స్పందించిన కంపెనీ యజమాన్యం.. పోలీసులను సంప్రదించామని.. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.  ఈ ఘటన కారణంగా సింగ్ టావో షేరు ధర ఆమాంతం పడిపోయింది. సోమవారం ( అక్టోబర్ 23) ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని అవుట్‌లెట్ నివేదించింది. చైనా బీరు కంపెనీ బ్రాండ్ కు తీరని నష్టం జరిగిందని చైనా వాసులు తెలిపారు

Also Read: ఓటీటీలోకి ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్​.. బట్ వన్ కండిషన్!

పండుగయినా... పబ్బమైనా.. సంతోషమొచ్చినా.. బాధ కలిగినా.. ప్రస్తుతం అందరు బీరు బాటిల్ ఎత్తేస్తున్నారు.  మద్యం ప్రియులు  వీకెండ్ వస్తేచాలు బీరు బాటిల్ వెనుక పరిగెడుతున్నారు.  గ్లామర్ పెంచుకోవడానికి కొందరు.. ఫ్రేస్టేషన్ దించుకోవడానికి కొందరు. లవ్ ఫెయిల్యూర్ అని లైఫ్ ఫెయిల్యూర్ అని ఇలా ఏదో ఒక రీజన్ తో బార్ కెళ్ళి బీరు తాగుతారు. ఇంకొందరు ఇంటిని బార్ గా మార్చేస్తారు.  మరి ఇలాంటి వారు బీరు తాగేముందు కాస్త ఆలోచించండి గురూ...