
జయం రవితో కలిసి నయనతార నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ఇరైవన్, తెలుగులో ‘గాడ్’ పేరుతో ఈ మూవీ విడుదలైంది. ఐ అహ్మద్ దీనికి దర్శకుడు. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో గాడ్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26న హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌తో ప్రకటించింది.
గాడ్ మూవీని పిల్లలతో కలిసి చూడకండి. ఎందుకంటే..ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సీన్స్ కు పిల్లలు భయపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ మూవీ మాస్ ఆడియన్స్కి, క్రైం థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే వారికి మాత్రం పండుగనే చెప్పుకోవాలి.
నగరంలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను ఎదుర్కొనే కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. మరి ఈ థ్రిల్లర్ స్టోరీని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదిరిస్తారో వేచి చూడాలి.