వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్

వీడియోకాన్ సీఈఓ వేణుగోపాల్ అరెస్ట్

వీడియోకాన్ కంపెనీ సీఈఓ వేణుగోపాల్ ధూట్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ లోన్ ఫ్రాడ్ కేసులో ఆరోపణలపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను సీబీఐ శుక్రవారం అరెస్ట్ చేసింది. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా 2018లో చందా కొచ్చర్ వైదొలిగారు. ఈ క్రమంలో 2012లో బ్యాంక్ సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేశారు. అది కాస్తా ఎన్పీఏ (నిరర్ధక ఆస్తి)గా మార్చడం వల్ల కొచ్చర్ కుటుంబానికి లబ్ధి  చేకూరిందని సీబీఐ ఆరోపించింది.