ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో మంగళ, బుధవారాల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందం బియ్యం వ్యాపారం చేసే అక్రమార్కుల ఇండ్లలో విస్తృత తనిఖీలు జరిపి 204 క్వింటాల ప్రజాపంపిణీ బియ్యం ను పట్టుకున్నట్లు ఓఎస్డీ అంజయ్య తెలిపారు.
తల్లడ మండలం పాత మిట్టపల్లిలో 48 క్వింటాలు, ఖమ్మం సిటీలోని పార్శీబంధంలో 89 క్వింటాలు, గోపాలపురంలో 67 క్వింటాల బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన అక్రమ వ్యాపారులు ఎర్ర ప్రసాద్, రాము, జగదీశ్ కు అమ్ముకుంటున్నట్లు పట్టుబడ్డ వ్యక్తులు తెలిపినట్లు చెప్పారు. బియ్యాన్ని శాంపిల్ టెస్ట్ కు పంపనున్నట్లు అంజయ్య పేర్కొన్నారు.

