
- వైజాగ్ కు చెందిన కల్లాస్ కెమికల్స్ కంపెనీ ఎండీ ఫ్రాడ్
- సుమారు 60 మంది వద్ద రూ. కోట్లలో వసూలు
- చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: తన దగ్గర ప్రొడక్టులు కొంటే తామే మార్కెటింగ్ చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి పలువురి వద్ద రూ. కోట్లలో వసూలు చేశాడు. ఈ విషయమై రిమాండ్కు వెళ్లి బెయిల్పై వచ్చినా అతడిలో మార్పు రాలేదని బాధితులు వాపోతున్నారు. బుధవారం హైదరాబాద్ లోని హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో బాధితులు విక్రమ్ సింగ్ , హనుమంతురావు మీడియాతో మాట్లాడారు. వైజాగ్ కు చెందిన కల్లాస్ కెమికల్స్ కంపెనీ ఎండీ సూర్యచంద్ర కల్లా ఫ్లోర్ క్లినింగ్, డిటర్జెంట్స్ ప్రొడక్టులను తక్కువ ధరకు అమ్మి, వాటిని మార్కెటింగ్ కూడా చేస్తామని ప్రకటనలు ఇచ్చారని చెప్పారు.
ఆయన మాటలు నమ్మి లక్షల్లో ఇన్వెస్ట్ చేసి ప్రొడక్టులు కొంటే నకిలీవి పంపించి తమను మోసం చేశాడన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆయను రిమాండ్ కు పంపారన్నారు. బెయిల్ పై వచ్చి అదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. సుమారు 60 మంది వద్ద రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.