VijayDevarakonda: దేవరకొండ కొత్త సినిమాల అప్డేట్స్.. ఒకదానికి మించి మరొకటి.. యదార్థ సంఘటనలతో..

VijayDevarakonda: దేవరకొండ కొత్త సినిమాల అప్డేట్స్.. ఒకదానికి మించి మరొకటి.. యదార్థ సంఘటనలతో..

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. శుక్రవారం MAY9 తన పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ నటిస్తున్న చిత్రాలనుంచి అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ ఇచ్చారు మేకర్స్.

విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తీస్తున్న ‘కింగ్‌‌‌‌డమ్’చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేశారు. ఇందులో మాస్ లుక్‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు విజయ్. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 30న విడుదల కానుంది.

మరోవైపు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేస్తూ ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. లెంగ్తీ హెయిర్‌‌‌‌‌‌‌‌తో వెనుకనుంచి ధ్యానముద్రలో విజయ్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది.

బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. విజయ్‌‌‌‌కు జంటగా రష్మిక మందన్న నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబోలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. 

అలాగే 'రాజా వారు రాణి గారు' సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా. ఇపుడీ ఈ యువ డైరెక్టర్ తో విజయ్ సినిమా చేస్తున్న సంగతి  తెలిసిందే.  దిల్ రాజు నిర్మాత. ‘రౌడీ జనార్థన్’టైటిల్‌‌‌‌తో తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి ఇంటెన్స్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో విజయ్‌‌‌‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామా రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను త్వరలో ప్రారంభించనున్నారు.