విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం: గోల్డ్ మెడల్ కొట్టిన కిక్ బాక్సర్

విజయ్ దేవరకొండ ఆర్థిక సహాయం: గోల్డ్ మెడల్ కొట్టిన కిక్ బాక్సర్

హీరో విజయ్ దేవరకొండ చేసిన ఆర్థిక సహాయం ఓ క్రీడాకారుడి కెరీర్ కు హెల్ప్ చేసింది. గరీబోళ్లను ఆదుకోవడానికి విజయ్ స్థాపించిన ‘దేవరకొండ ఫౌండేషన్’ పలువురికి అండగా నిలబడుతుంది. ఇందులో భాగంగా… మెదక్ జిల్లాకు చెందిన గణేష్ ఎంబారి కిక్ బాక్సింగ్ ప్లేయర్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే… న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజ్ కట్టడానికి తగినంత మనీ లేదు. పోటీపడి గెలిచే సత్తావున్న తనకు…  ‘దేవరకొండ ఫౌండేషన్’ అండగా నిలపడింది. ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న విజయ్.. తన ఫౌండేషన్ ద్వారా 25వేల రూపాయల ఎంట్రీ ఫీస్ ను చెల్లించాడు. ఫిబ్రవరి 1న చెక్ ను దేవరకొండ గోవర్ధన రావు గణేష్ కు అందించారు. దీంతో ఈనెల 13న జరిగిన పోటీలో గణేష్ గోల్డ్ మెడల్ సాధించాడు. గణేష్ మాట్లాడుతూ.. విజయ్ చేసిన సహాయం తనలో ఆత్మవిశ్వాసం నింపేలా చేసిందని..అది  గోల్డ్ మెడల్ సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నాడు.

మరిన్ని వార్తలు

మెట్రో అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

ఈ హోటల్స్​లో ఖర్చు తక్కువ

గ్రీన్​టీతో పళ్లు క్లీన్​

మెట్రో విస్తరించకుండా MIM అడ్డుకోగా TRS వంతపాడింది..