పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ

పోలీస్ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ

విజయ్‌‌ దేవరకొండ హీరోగా ‘జనగణమన’ పేరుతో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా 

చేస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే టైటిల్‌‌తో మలయాళంలోనూ ఓ సినిమా వస్తోంది. మలయాళ స్టార్‌‌‌‌ పృథ్విరాజ్‌‌ సుకుమారన్‌‌, సూరజ్‌‌ వెంజరమూడు లీడ్‌‌ రోల్స్‌‌ చేస్తున్నారు. ‘డ్రైవింగ్‌‌ లైసెన్స్‌‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమా ఇది. డిజో జోస్ ఆంటొని దర్శకుడు. ఈ మూవీని ఏప్రిల్‌‌ 28న రిలీజ్‌‌ చేయనున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. ఓ క్రిమినల్‌‌, పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌ మధ్య ఇంటరాగేషన్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా రూపొందుతోంది. గతేడాది జనవరిలోనే టీజర్‌‌ రిలీజ్‌‌ చేశారు. మేజిక్‌‌ ఫ్రేమ్స్‌‌, పృథ్విరాజ్ ప్రొడక్షన్స్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. శ్రీదివ్య, ధ్రువన్, షమ్మి తిలకన్, రాజా కృష్ణమూర్తి ఇతర పాత్రలు పోషించారు.