నేను చాలా మారాను..ప్రేమపై నమ్మకం కుదిరింది

నేను చాలా మారాను..ప్రేమపై నమ్మకం కుదిరింది

‘మరోసారి సిక్సర్ కోసం ప్రయత్నించాను.. బంతి గాలిలో ఉంది.. బౌండరీకి అవతల పడుతుందో లేదో మరికొద్ది గంటల్లో తేలనుంది’ అంటున్నాడు విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ నటించిన  సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈనెల 14న విడుదలవుతున్న సందర్భంగా విజయ్ చెప్పిన విశేషాలు.

  • ఈ సినిమాలో మూడు రకాల ప్రేమకథలున్నాయి. నా కెరీర్‌‌‌‌లో ఎక్కువ కష్టపడ్డ సినిమా ఇదే. శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడు కథల  మధ్య రిలేషన్ ఏమిటనేది తెరపైనే చూడాలి.
  • ఒక డిఫరెంట్ స్పేస్‌‌లో ఉండే సినిమా ఇది. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదు. ప్రేమలో త్యాగం, రాజీ, దైవత్వం ఉంటాయి. హీరోకి అవేవీ తెలియకపోవడమే  కాన్‌‌ఫ్లిక్ట్. శీనయ్య కథ కొత్తగా ఉంటుంది. ఆ పాత్రకి బాధ్యతలెక్కువ. అందుకు పూర్తి భిన్నంగా ప్యారిస్ లవ్​స్టోరీ ఉంటుంది. మరొకటి ‘అర్జున్‌‌రెడ్డి’కి దగ్గరగా ఉంటుంది. శీనయ్య పాత్ర నా ఫేవరేట్.  రిఫరెన్స్‌‌గా మా నాన్న బాడీ లాంగ్వేజ్‌‌  తీసుకున్నాను. ఆ పాత్రకి జంటగా ఐశ్వర్య రాజేష్ పోషించిన సువర్ణ రోల్‌‌ని కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు.
  • నేను యాక్షన్ సినిమాలో గడ్డం పెంచినా ‘అర్జున్ రెడ్డి’తోనే పోల్చుతారు.  లవ్ స్టోరీ, సైన్స్ ఫిక్షన్ స్టోరీలో గడ్డం పెంచినా ఆ పోలిక తప్పదు. పోల్చడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే  ‘అర్జున్ రెడ్డి’ అనేది కొన్ని తరాలపాటు గుర్తుండిపోయే సూపర్ హిట్. అలాంటి క్రేజీ మూవీతో పోలుస్తున్నందుకు హ్యాపీ. నా నటన మినహా ఈ సినిమాలో ప్రేక్షకులకు ఏది నచ్చినా ఆ క్రెడిట్ దర్శకుడు క్రాంతి మాధవ్,  సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ, నిర్మాత రామారావు గార్లకే దక్కుతుంది. ఇది పూర్తిగా క్రాంతి మాధవ్ బ్రెయిన్ చైల్డ్. తన రచనతో ప్రేక్షకులను మెప్పిస్తాడనే నమ్మకముంది.
  • ఈ సినిమా కోసం ప్రియం, ముంబై తీరం లాంటి కొన్ని టైటిల్స్ పరిశీలించాం. కానీ పాతగా అనిపించాయి. ఫైనల్‌‌గా ఇదే బెస్ట్ టైటిల్ అనిపించింది.  టైటిల్ కాదు గానీ బుకింగ్స్ చూసి నేను హ్యాపీ. సినిమా పేరు ‘ఎక్స్ వై జెడ్’ అని పెట్టి టికెట్స్ అమ్మినా నాకు ఓకే.
  • అన్ని రకాల సినిమాలు చేయాలి, ఎప్పుడూ ఒకే రకమైన కథలు చేయడం నాకూ మంచిది కాదు, ప్రేక్షకులకూ ఇష్టం ఉండదు. అందుకే ఇకపై ప్రేమకథలు చేయనంటున్నాను. లవ్ స్టోరీస్ చేయను అంటే ప్రేమ ప్రథానకథగా వచ్చే సినిమాలు చేయనని అర్థం. సినిమాలో చిన్న చిన్న లవ్ ట్రాక్స్ చేయనని కాదు. ఇక పూరి గారి సినిమా చేయడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్‌‌తో లవ్ స్టోరీస్ చేయనని చెప్పడం లేదు. నాకు చిన్నప్పటి నుండే ఓవర్ కాన్ఫెడెన్స్.
  • ‘డియర్ కామ్రేడ్’కి రివ్యూస్ ఎలా వచ్చినా నార్త్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి దేశాలలో యూ ట్యూబ్ ద్వారా మంచి ఆదరణ దక్కించుకుంది  అలాగే పూరి జగన్నాథ్ సినిమా ముంబైలో షూటింగ్ చేస్తుంటే అందరూ బాబీ అని పిలుస్తున్నారు. ఆ చిత్రం ఫలితంపై నేను సంతృప్తికరంగా ఉన్నాను.
  • ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని దశలుంటాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటించాక నేను కూడా మారాను. నాలో ఇంత పెద్ద మార్పు ఎందుకువచ్చిందో నాకే తెలీదు. ఈ ఫేజ్‌‌లో నేను కొత్తగా ఏం చేయబోతున్నానో మరో మూడు నెల్లలో మీరే చూస్తారు. అంతేకాదు మరో రెండేళ్ల వరకూ నేను చేసే సినిమాలు కొత్తగా ఉండబోతున్నాయి.

ఒకప్పుడు ప్రేమ అనేది నాన్సెన్స్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ప్రేమపై నమ్మకం కుదిరింది, జీవితంలో కచ్చితంగా ప్రేమ ఉండాలి. అయితే పెళ్లి మాత్రం ఇప్పుడప్పుడే చేసుకోను. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. ఆ విషయంలో నేనింకా పిల్లాడినే అని ఫీలవుతుంటాను. అందుకే మరికొంత కాలం తర్వాత ఆలోచిస్తాను.

సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తూ వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తాను. వాళ్లు నా కోసం సమయం వెచ్చించి వీడియోలు లేదా ఫోటో ఎడిట్స్ చేస్తున్నారంటే నాపై ఎంతో ప్రేమతోనే చేస్తున్నారని భావిస్తాను. అందుకే ఐ లవ్ ట్రోల్స్.