KINGDOM Trailer: ‘కింగ్‍డమ్’ కౌంట్‌డౌన్ షురూ.. ట్రైలర్ రీలిజ్ డేట్ ఇదే!

KINGDOM Trailer: ‘కింగ్‍డమ్’ కౌంట్‌డౌన్ షురూ.. ట్రైలర్ రీలిజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‍డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జులై31న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో మేకర్స్ వేగం పెంచారు. అంతేకాకుండా సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ ఇవ్వడానికి సిద్దమయ్యారు.

ఈ సందర్భంగా ‘కింగ్‍డమ్’ట్రైలర్కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. రానున్న శుక్రవారం (జులై 25న) ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు టాక్. ఇందుకు సంబంధించిన సాలిడ్ ట్రైలర్ కట్ను రెడీ చేసి ఉంచారంట డైరెక్టర్ గౌతమ్. ఈ ఒక్క ట్రైలర్తో ఇన్నాళ్లు పెట్టుకున్న అంచనాలన్నీ మరింత రెట్టింపు అవుతాయని కూడా సినీ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది. అయితే, ట్రైలర్ విషయంపై మేకర్స్ నుంచి.. రేపు సాయంత్రం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

కింగ్డమ్‌‌ మూవీ.. పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా గౌతమ్ తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇటీవలే ‘కింగ్‍డమ్’నుంచి ‘అన్న అంటేనే..’పాట విడుదల చేశారు. ఈ ఎమోషనల్‌‌ సాంగ్‌‌ను అనిరుధ్ రవిచందర్‌‌‌‌ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడాడు.

ALSO READ : HHVM: ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి పెద్ద కండీషనే పెట్టిన పోలీసులు

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగిన ఈ పాటలో విజయ్‌‌కు అన్న పాత్రలో సత్యదేవ్ కనిపించాడు. ఇద్దరూ తమ బాల్యాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉన్న ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో కింగ్‍డమ్తో విజయ్ దేవరకొండ మళ్లీ సక్సెస్ బాటపడతారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు. ఏమవుతుందో చూడాలి. ఈ సినిమాని శ్రీకర స్టూడియోస్‌‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.