
ఈ వేలెంటైన్స్ డేకి ‘వరల్డ్ ఫేమస్ లవర్’గా రానున్నాడు విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ లుక్ సూపర్బ్‌గా ఉందని ఇప్పటికే మెచ్చుకుంటున్నారు జనాలు. అయితే తర్వాతి సినిమాలో విజయ్ లుక్ దీన్ని మించి ఉంటుందట. పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’ అనే సినిమా చేయనున్నాడు దేవరకొండ. ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రత్యేకంగా థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. రోజుకు 8 గంటలు కష్టపడుతున్నాడట. ఫైటర్ రోల్‌లో సరికొత్తగా కనిపిస్తాడంటూ టీమ్ ఊరిస్తోంది. ఈ నెల 20 నుండి ముంబైలో షూట్మొదలు కానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాని ఎక్కువగా ముంబైలోనే షూట్ చేయనున్నారు. విజయ్ సరసన జాన్వీ కపూర్ నటించనుందనే వార్త ప్రచారంలో ఉంది. అది నిజమైతే మాత్రం ఈ సినిమాపై ఆల్రెడీ ఉన్న అంచనాలు మరో రేంజ్‌కి వెళ్లిపోవడం ఖాయం.