బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో తన 12వ చిత్రంలో నటిస్తుండగా, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన’ సినిమా చేస్తున్నాడు. అలాగే తన 14వ మూవీ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. డియర్ కామ్రేడ్, ఖుషి సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో విజయ్ నటిస్తున్న మూడో చిత్రమిది. అలాగే ‘టాక్సీవాలా’ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో రాబోతున్న మూవీ. మరోవైపు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత మూడోసారి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
