పోలీసుల‌ను ఉద్దేశిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ వీడియో

పోలీసుల‌ను ఉద్దేశిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ వీడియో

హైదరాబాద్‌: పోలీసులు రియ‌ల్ హీరోల‌న్నాడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పోలీసుల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్‌ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరూ పోలీసులకు మద్దతుగా ఉంటారని విజయ్‌ చెప్పాడు.

తెలంగాణ పోలీస్‌ హెడ్ క్వార్టర్స్ ను విజయ్‌ దేవరకొండ సందర్శించిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ పోలీసులను ఉద్దేశిస్తూ ఈ వీడియో సందేశం పంపించిన‌ట్లు తెలిపాడు. ఈ వీడియోను డీజీపీ తెలంగాణ పోలీస్‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఉత్సాహానిచ్చేలా సందేశం ఇచ్చిన విజయ్‌కి డీజీపీ మహేందర్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.