విజయ్, సమంత మాస్ కంబ్యాక్.. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్

విజయ్, సమంత మాస్ కంబ్యాక్.. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సమంత(Samantha) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని టాక్. 

ఇక విజయ్ గత చిత్రం లైగర్, సమంత గత చిత్రం శాకుంతలం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అందుకే ఈ ఇద్దరి కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే ఖుషి. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 

Also Read : వరలక్ష్మి పూజలో క్లీంకార.. ఫోటో షేర్ చేసిన ఉపాసన

ఖుషి సినిమా దాదాపు రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటిరోజు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో అందుకుంది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా మొదటి రోజు రూ. 9.50 నుంచి రూ.10.00 కోట్లు షేర్ వసూలు వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.13.50 కోట్ల షేర్ అందుకుందట. దీంతో లైగర్​-శాకుంతలం వంటి భారీ డిజాస్టర్లు తరువాత కూడా అదిరిపోయే కలెక్షన్స్ అందుకున్నారు విజయ్‌,సమంత. దీంతో ఈ జంట సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక సినిమా పాజిటీవ్ టాక్ రావడంతో రానున్న రెండు మూడు రోజుల్లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పెట్టె అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ కలిసి ఖుషి సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ అద్భుతమైన సంగీతం ఆడించాడు.